తాడిపత్రి: కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యల పరిష్కరించాలని తాడిపత్రిలో విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట ఆందోళన
విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ పవర్ జేఏసీ నాయకులు పేర్కొన్నారు. మంగళవారం తాడిపత్రిలోని విద్యుత్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ పవర్ జెఏసి ఆధ్వర్యంలో విద్యుత్ కార్మికులు రెండవ రోజు నల్ల రిబ్బన్ ధరించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి పనిచేస్తున్నారని, కానీ ప్రభుత్వం మాత్రం విద్యుత్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందన్నారు. కావున విద్యుత్ కాంట్రాక్టు కార్మికులను శాశ్వత ఉద్యోగస్తులుగా గుర్తించి విద్యుత్ సంస్థలోకి విలీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు.