జుక్కల్: నిజాంసాగర్ ప్రాజెక్ట్ దిగువ మంజీర నదిలో వ్యక్తి గల్లంతు, గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు
జక్కల్ నియోజవర్గం నిజాంసాగర్ మండలం అచ్చంపేట్ సమీపంలోని నాగమడుగు వద్ద మంజీర నదిలో బుధవారం మధ్యాహ్నం 2 సమయంలో వడ్ల రవి (42) అనే వ్యక్తి వరద నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు. బంజపల్లికి చెందిన రవి కాలకృత్యాల కోసం వెళ్లగా ఈ ఘటన జరిగింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో, గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహం దొరకకపోవడంతో గాలింపు చర్యలు వస్తున్నట్లు తెలిపారు. గత రెండు రోజుల్లో మంజీరలో గల్లంతైన వారి సంఖ్య ఇద్దరికి చేరగా, ఒకరి మృతదేహాన్ని ఇప్పటికే గుర్తించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.