ప్రపంచంలో తొలి వాస్తు శిల్పి, సృష్టికర్త విశ్వకర్మ..పాడేరులో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ
ప్రపంచంలో తొలి వాస్తు శిల్పి, సృష్టికర్త విశ్వకర్మ అని అల్లూరి సీతారామరాజు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్ అన్నారు. పాడేరులోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విశ్వకర్మ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా విశ్వకర్మ చిత్రపటానికి జాయింట్ కలెక్టర్ పూలమాలలు వేశారు. విశ్వకర్మ పూజా ప్రాముఖ్యతను వివరించారు. విశ్వ కర్మ జయంతిని, విశ్వకర్మ పూజను వస్తు తయారీదారులు, ఇంజనీర్లు, జరుపుకుంటారని తెలిపారు.