తాడిపత్రి: పట్టణంలో ఘనంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75వ జన్మదిన వేడుకలు, ఆలయంలో ప్రత్యేక పూజలు
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మోడీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని కాశీవేశ్వేశ్వర స్వామి ఆలయంలో బుధవారం అర్చన, జలాభిషేకంతో పాటుగా ప్రత్యేక పూజలు చేశారు. బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు అంకాల్ రెడ్డి, జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, జిల్లా ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణ ముఖ్య అతిథులుగా హాజరు అయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ అనేక సంస్కరణలు తీసుకొని వచ్చి ప్రపంచంలో భారత దేశాన్ని అగ్ర దేశాల జాబితాలో చేర్చారని అన్నారు.