ఉదయగిరి: వింజమూరు పరిసర ప్రాంతాల్లోని అక్రమ అవుట్లకు నోటీసులు జారీ చేసిన అధికారులు
వింజమూరు పరిసర ప్రాంతాల్లోని అక్రమ లేఔట్లకు మంగళవారం నుడా అధికారులు నోటీసులు జారీ చేశారు. నుడా పంచాయతీ కార్యదర్శి జి. శ్రీధర్ చౌదరి మాట్లాడుతూ.. వింజమూరు పరిసర ప్రాంతాల్లో 22 లేఅవుట్లకు గాను రెండు లేఔట్లకు మాత్రమే నుడా అనుమతులు ఉన్నాయని తెలిపారు. మిగిలిన వారు కూడా తమ కార్యాలయానికి వచ్చి కావలసిన పత్రాలు సమర్పించే అనుమతులు పొందాలని సూచించారు.