చీమకుర్తి పట్టణంలో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ తల్లి 35వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాన్ని శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు 516 కళాశాలతో , కలశాలలో గంగా జలాలను నింపుకొని అమ్మవారి ఊరేగింపులో పాల్గొన్నారు. ఊరేగింపు కార్యక్రమం పట్టణంలోని శ్రీ కోదండ రామస్వామి ఆలయం వద్ద నుండి శ్రీ సాక్షి రామలింగేశ్వర స్వామి ఆలయం వరకు కొనసాగింది. అనంతరం భక్తులు శ్రీ కనకదుర్గమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.