గూడూరు మండలంలోని పెంచికలపాడు గ్రామం దగ్గర కుక్కల దాడిలో జింక మృతి చెందింది. గ్రామంలోని పాఠశాల ఆవరణలో జింక మృతి చెంది ఉండడం గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు ఖననం చేయించారు. కుక్కల దాడిలో జింక మృతి చెంది ఉంటుందని భావిస్తున్నారు.