ప్రకాశం జిల్లా మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. రాంబాబు మాట్లాడుతూ... అంటరానితనం కుల నిర్మూలన కోసం కృషి చేసిన మహానుభావుడని కొనియాడారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దళిత సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు