ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలను దళిత సంఘ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించి మాట్లాడారు. ప్రముఖ న్యాయవాది ఆర్థిక శాస్త్రవేత్త రాజకీయ నేత సంఘసంస్కర్త అంబేద్కర్ అంటరానితనం కుల నిర్మూల కోసం కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశారన్నారు. రాజ్యాంగం రచించిన ఆయన మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేశారని కొనియాడారు.