ఇబ్రహీంపట్నం: కార్తీక మాసం మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక : టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ గౌడ్
కార్తీక మాసం సందర్భంగా హఫీజ్ పేట డివిజన్లో ఆర్టీసీ కాలనీ నందు నిర్వహించిన సామూహిక వనభోజనాల కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తీక మాసం మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. వనభోజనాలు మనసులను దగ్గర చేస్తాయని ఆధ్యాత్మికతతో పాటు సామాజిక ఐక్యతను పెంచుతాయని అన్నారు. ఇలాంటి సత్సంగాలు దానం ధర్మం సమాజానికి మేలు చేస్తాయని ఆయన తెలిపారు.