ఖైరతాబాద్: చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం
చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం సంభవించింది. జవహర్నగర్ కాలనీ ఎస్వీఎస్ యాంపిల్ హోమ్స్ వద్ద భవన నిర్మాణ పక్కన వేసుకున్న లేబర్ షెడ్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే ఇళ్లు మొత్తం దగ్ధం అయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.