అసిఫాబాద్: హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం: ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ASF ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆరోపించారు. బుధవారం వాంకిడి రైతు వేదికలో 29 మందికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేద యువతుల పెళ్లిళ్లను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణ లక్ష్మి పథకాన్ని తీసుకొచ్చారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి మాట తప్పిందని మండిపడ్డారు.