ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 30 వ వార్డు నందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. గత ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజలను మోసం చేశారని ఎమ్మెల్యే అన్నారు. జిల్లా ఏర్పాటు చేయమని నిరసనలు తెలిపిన ఆవేదన వ్యక్తం చేసిన అర్థం చేసుకోలేదు అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు.