ఒంగోలులో భారీ వర్షం. లోతట్టు ప్రాంతాలలో రోడ్ల పైన ప్రవహిస్తున్న నీరు. ఆనందంలో రైతులు ఆందోళనలో లోతట్టు ప్రాంత ప్రజలు.
Ongole Urban, Prakasam | Sep 17, 2025
ప్రకాశం జిల్లా ఒంగోలు నగర పరిసర ప్రాంతాలలో బుధవారం ఉదయం భారీ వర్షం కురుస్తుంది అల్పపీడన ప్రభావంతో రాబోవు రెండు రోజులు పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది అయితే ఇప్పటికే ఖరీఫ్‌లో సగం చేసిన భూములు వర్షం అందక ఎండు ముఖం పట్టి ఉన్నాయి. అయితే ఈ వర్షం ఎండుతున్న పంటలకు జీవం పోయటమే కాకుండా ఖరీఫ్ సాగు విస్తరణ పెరిగేందుకు కూడా ఉపయోగపడుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఖరీఫ్ సాగుకు అవసరమైన ఎరువుల కొరత కూడా లేదని అందుబాటులో ఎరువులు కూడా ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాల