వర్ని: ఉమ్మడి వర్ని మండలంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన అధికారులు ప్రజాప్రతినిధులు
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఉమ్మడి వర్ని మండలంలో ప్రభుత్వ కార్యాలయాలు గ్రామపంచాయతీల వద్ద జాతీయ జెండాను ఎగరవేశారు. బుధవారం ఉదయం 9 గంటలకు వర్ని చందూరు మోస్రా రుద్రూరు, కోటగిరి పోతంగల్ మండల్ లో జెండా ఎగురవేసి విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. వర్ని మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు జాతీయ జెండా ఎగురవేశారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.