నారాయణపేట్: అనుమానిత వ్యక్తుల సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి: పట్టణ ఎస్ఐ వెంకటేశ్వర్లు
ఇటీవల ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ల ఘటన నేపథ్యంలో నారాయణపేట ఎస్పీ డాక్టర్ వినీత్ దేశాల మేరకు మంగళవారం పట్టణ ఎస్సై వెంకటేశ్వర్లు జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ మరియు వివిధ ముఖ్య కూడళ్లలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రతి పౌరుడు అప్రమత్తంగా ఉండాలని పరిసరాలలో అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులు నిర్లక్ష్యంగా వదిలిన సంచులు వాహనాలు లేదా అనుమాన స్పదంగా వస్తువులు కనిపించిన వెంటనే పోలీస్ స్టేషన్ కు లేదా డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.