నారాయణపేట్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా వెంగళరావు నగర్ డివిజన్ లో ఆదివారం కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో మక్తల్ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి, టి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, సిపిఐ పార్టీ నాయకులు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈ టి నరసింహ హాజరై ఎన్నికల ప్రచారం నిర్వహించారు.