నారాయణపేట్: కవి రచయిత అందెశ్రీ మృతి నివాళులర్పించిన మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి
ప్రముఖ కవి రచయిత అందెశ్రీ ఆకస్మిక మృతి పట్ల సోమవారం మక్తల్ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అందెశ్రీ మరణం తెలంగాణ సాహిత్య లోకానికి తీరని లోటని మంత్రి అన్నారు. అందెశ్రీ తన పాటతో తెలంగాణ చరిత్ర ప్రత్యేక రాష్ట్ర అవసరాన్ని నొక్కి చెబుతూ ఉద్యమాన్ని తీవ్ర తరం చేశారని రాష్ట్రం సిద్ధించడంలో ఆయన పాత్ర కీలక మైనదని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.