స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్ అవగాహన పోస్టర్స్ విడుదల చేసిన డి ఎం హెచ్ వో డాక్టర్ దేవి
Anantapur Urban, Anantapur | Sep 16, 2025
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా సెప్టెంబర్ 17 వ తేదీ నుండి అక్టోబర్ 2, రెండవ తేదీ వరకు రెండు వారాలపాటు స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్ (ఆరోగ్యవంతమైన మహిళ-శక్తివంతమైన కుటుంబం) అను సమగ్ర ఆరోగ్య ప్రచార, వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు డిఎంహెచ్ఓ డాక్టర్ దేవి తెలిపారు. మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో డిఎంహెచ్వో కార్యాలయంలో డిఎంహెచ్వో దేవి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళల ఆరోగ్యాన్ని కాపాడి కుటుంబం బలపరిచే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేసామన్నారు.