సంగారెడ్డి: అందాల పోటీలు నిర్వహించిన ప్రభుత్వానికి విద్యార్థుల సమస్యలు పట్టదా? : సంగారెడ్డిలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి
తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును కాపాడేందుకు ప్రభుత్వం వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని సంగారెడ్డి జిల్లా ఏఐఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి ఎంబడి దత్తు రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన సంగారెడ్డిలో మాట్లాడుతూ హంగు ఆర్భాటాలు నిర్వహిస్తున్న ప్రభుత్వానికి విద్యార్థుల సమస్యలు పట్టడం లేదని మండిపడ్డారు.