రామగుండం: కమిషనరేట్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
రామగుండం కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమానికి రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా పాల్గొని జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా సిబ్బందితో అధికారులతో కలిసి జాతీయ గీతాన్ని రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ గీతాన్ని ఆలపించారు దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ కోసం పోరాడి సెప్టెంబర్ 17న ప్రజాపాలనలోకి వచ్చిన రోజు అని తెలంగాణ ప్రజలకు ఎంతో ముఖ్యమైన రోజు అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కమీషనర్ పరిధిలోని పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.