డిసెంబర్ 10,11 తేదీలలో అనంతపురం నగరంలో జరగనున్న అఖిల భారత విద్యార్థి బ్లాక్ (ఏ.ఐ.ఎస్.బి) 3 వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఏ.ఐ.ఎస్.బి జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. హిందూపురం పట్టణంలో గల బాల యేసు డిగ్రీ కళాశాల ఆవరణంలో రాష్ట్ర మహాసభల పోస్టర్ లు ఆవిష్కరించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. సోషలిజం, శాంతి, అభ్యుదయం లక్ష్యాలుగా సుభాష్ చంద్రబోస్ ఆశయాల సాధనకోసం 1951 జూన్ 25 న ఏర్పడిన అఖిల భారత విద్యార్థి బ్లాక్ (ఏ.ఐ.ఎస్.బి) నిరంతరం విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు