నారాయణపేట్: ప్రజలను గూడ్స్ వాహనాలలో తరలిస్తే కఠిన చర్యలు: మద్దూర్ ఎస్సై విజయకుమార్
నారాయణపేట ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాల మేరకు బుధవారం మద్దూరు పట్టణ ఎస్సై విజయకుమార్ ఆధ్వర్యంలో మద్దూర్ పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ప్రజలను కూలీలను చిన్న పిల్లలను గూడ్స్ వాహనాలలో రవాణా చేస్తే చట్టప్రకారం కట్టిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు. ప్రజల రక్షణ రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు ప్రజలను గూడ్స్ వాహనాల్లో తరలిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్ఐ హెచ్చరించారు.