ఇబ్రహీంపట్నం: చౌదరి గూడలో 60 క్వింటాల పత్తికి నిప్పు పెట్టిన గుర్తు తెలియని దుండగులు, వాపోయిన బాధితులు
చౌదరి గూడ మండలంలోని పెద్ద ఏల్కచర్ల గ్రామంలో పత్తికి నిప్పు పెట్టిన ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం అర్ధరాత్రి పత్తికి గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టి దహనం చేశారు. 60 క్వింటాల పత్తిని ఇద్దరు కౌలు రైతులు ఒక ఇంట్లో నిలువ చేశారు. పత్తి దహనం కావడంతో బాధితులు కన్నీరు మున్నీరుగా విలపించారు. దుండగులను పట్టుకొని న్యాయం చేయాలని బాధితులు వాపోయారు.