శ్రీకాకుళం: రూరల్ పరిధి సప్తపురాల్లో 55 లక్షల రూపాయల నిధులతో సిసి రోడ్లకు శంకుస్థాపన చేసిన శ్రీకాకుళం, ఆముదాలవలస ఎమ్మెల్యేలు
రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని శ్రీకాకుళం, ఆమదాలవలస ఎమ్మెల్యేలు గొండు శంకర్, కూన రవికుమార్ లు అన్నారు. రూరల్ మండలం పరిధిలోని సప్తపురాల్లో 55.22 లక్షల రూపాయలతో మంజూరైన సీసీ రోడ్లకు మంగళవారం వారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ గత వైసిపి పాలనలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు. ఆనాటి చీకటి రోజులను ప్రజలు మరచిపోయి పండుగ వాతావరణం లో జీవనం సాగిస్తున్నారని వివరించారు. 15వ ఆర్థిక సంఘం నిధులను కాజేసి గ్రామాల్లో అంధకారం నింపి కనీస మౌలిక సదుపాయాలకు నోచుకోక దిక్కు తోచిన స్థితిలో వైసిపి ప్రభుత్వం నిలిపిందని తెలిపారు.