పటాన్చెరు: పటాన్చెరు లాక్డ్ హౌస్లో భారీ చోరీ – 45 తులాల బంగారం, వెండి ఎత్తుకెళ్లిన దొంగలు
పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో మరోసారి దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసి ఖాళీగా ఉన్న ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు సుమారు 45 తులాల బంగారం, వెండిని అపహరించి పరారయ్యారు. ఆదివారం పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం— సికింద్రాబాద్కు చెందిన ఉత్తమ్, కుటుంబ సభ్యులతో కలిసి పోచారం పరిధిలోని ఎస్. సాయిదర్శన్ కాలనీలో నివసిస్తున్నారు. భార్య ప్రసవం కోసం కుటుంబ సభ్యులంతా ఈ నెల 16న స్వగ్రామానికి వెళ్లారు. దొంగలు ఇంటి తాళం పగులగొట్టి అల్మారాలో ఉన్న బంగారం, వెండిని ఎత్తుకెళ్లారు. ఇంటికి తిరిగి వచ్చిన ఉత్తమ్ కుటుంబ సభ్యులు చోరీ జరిగిన విషయం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.