నారాయణపేట్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బిఆర్ఎస్ కు ప్రజలు తగిన బుద్ధి చెప్తారు: మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బి ఆర్ ఎస్ నాయకుల ఆరోపణలపై మొక్కలు ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి తీవ్రంగా స్పందించారు. బుధవారం మంత్రి మాట్లాడుతూ పదేళ్లు అధికారంలో ఉన్న బి.ఆర్.ఎస్ నాయకులకు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే బిఆర్ఎస్ అబద్దపు వాదనలు చేస్తుందని ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రిని మంత్రులను విమర్శించి పింక్ మీడియాలో చూపించి ప్రజలను నమ్మించాలని భ్రమలో ఉండొద్దని తెలిపారు.