కనిగిరి:సమాజ అభివృద్ధిలో స్వచ్ఛంద సంస్థల పాత్ర కీలకమని కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ అన్నారు. కనిగిరి పట్టణంలోని మహిళా డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ స్వచ్ఛంద సేవా దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి హాజరైన మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ... విపత్తుల సమయంలో ప్రాణాలను కాపాడడం మొదలు పర్యావరణ పరిరక్షణ, విద్య, ఆరోగ్యం, రక్షణ తదితర అంశాల్లో స్వచ్ఛంద సంస్థల వాలంటీర్లు చేస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. స్వచ్ఛంద సేవ చేసే ప్రతి వాలంటీర్లకు గౌరవ వందనాలను తెలియజేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు స్వచ్ఛంద సంస్థల వాలంటీర్లు అధ్యాపకులు పాల్గొన్నారు.