ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో డిసెంబర్ 6వ తేదీ నుండి 12వ తేదీ వరకు రిలే నిరాహార దీక్ష చేపడుతున్నట్లు మేధావుల వేదిక నాయకులు ఓరుగంటి మల్లిక తెలియజేశారు. మార్కాపురం జిల్లాను ప్రకటించడం స్వాగతిస్తున్నాం కానీ దర్శి నియోజకవర్గాన్ని తొలగించడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నామన్నారు. మార్కాపురానికి దగ్గరగా ఉన్న దొనకొండ కురిచేడు మండలాలను కలపాలని రిలే నిరాహార దీక్ష చేపట్టుటకు అనుమతి కోసం సీఐ సుబ్బారావు కు వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు.