సిద్దిపేట అర్బన్: సెప్టెంబర్ 17ను ప్రజా పాలన దినోత్సవంగా జరుపుకుంటున్నాం : రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్
సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం ను ప్రజా పాలన దినోత్సవం గా జరుపుకుంటున్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో బుధవారం నిర్వహించిన ప్రజా పాలన దినోత్సవం కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై పోలీస్ గౌరవ వందన స్వీకరించి జాతీయ పతాకవిష్కరణ గావించి ప్రజలనుదేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులకు తెలంగాణ అమరవీరులకు జోహార్లు అర్పించి, బైరాన్ పల్లి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి వస్తున్నట్లు తెలిపారు. 1948 ఆగస్టు 27 న వందలాది మంద