గుంతకల్లు: గుత్తి ఆర్ఎస్ లో డెంగీ తో రెండేళ్ల హర్షిత్ హైదరాబాదులో చికిత్స పొందుతూ మృతి
గుత్తి ఆర్ఎస్ కు చెందిన వెంకటరమణ, మౌనిక దంపతులకు కుమారుడు హర్షిత్ (2) డెంగీ జ్వరంతో మృతి చెందాడు. గత వారం రోజులు క్రితం హర్షిత్ కు జ్వరం వచ్చింది. స్థానిక ఆసుపత్రిలో వైద్యం చేయించారు. అనంతరం కర్నూలుకు రెఫర్ చేశారు. అక్కడి నుంచి రెండు రోజుల క్రితం హైదరాబాద్ తీసుకెళ్లారు. హైదరాబాదులో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపించారు.