పటాన్చెరు: జిన్నారం మున్సిపాలిటీలో గురువారం ఉదయం 16.4° ఉష్ణోగ్రత నమోదు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. గురువారం ఉదయం వాతావరణ శాఖ వివరాల ప్రకారం ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. జిన్నారంలో 16.4 డిగ్రీలు, గుమ్మడిదలలో 16.4 డిగ్రీలు, అమీన్పూర్ లో 18.7° డిగ్రీలు, రామచంద్రాపురంలో 15.6 డిగ్రీలు, పటాన్ చెరులో 16.4° ఉష్ణోగ్రత నమోదయింది. గాలిలో తేమశాతం 84.4% గా నమోదయింది. ఉదయం పూట చలి నుండి ఉపశమనం పొందేందుకు చలి మంటలను కాచుకుంటున్నారు.