చీమకుర్తి మండలం పులికొండ ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా డిప్యూటీ డిఇఓ చంద్రమౌళీశ్వర రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... బడి ఈడు పిల్లలను పాఠశాలలకు పంపవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని, క్రమం తప్పకుండా పిల్లలను పాఠశాలలకు పంపాలన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. తరచూ పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్స్ నిర్వహణ వల్ల విద్యార్థుల విద్యా స్థితిగతులను పేరెంట్స్ తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు.