ఉరవకొండ: నింబగల్లు గ్రామం వద్ద రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం నింబగల్లు గ్రామం వద్ద శనివారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి బోల్తా పడటంతో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు బల్లనగుడ్డం గ్రామానికి చెందిన రవి ద్విచక్ర వాహనంలో వెళ్తూ అదుపుతప్పి బోల్తా పడి రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో చికిత్సల కోసం 108 అంబులెన్స్ వాహనంలో బళ్లారి లోని ఆసుపత్రికి తరలించారు.