వట్లూరులోని రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాలలో డ్రగ్స్ పై అవగాహన కల్పించిన ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ సూర్యచంద్రరావు
Eluru Urban, Eluru | Sep 16, 2025
ఏలూరు జిల్లా పెదపాడు మండలం వట్లూరులోని రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులకు డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు పాల్గొన్నారు. ఈమేరకు ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ విద్యార్థి దశను చిదిమేయక ముందే డ్రగ్స్ ను మనం వదిలివేయాలని ఇకపై డ్రగ్స్ కు నో చెప్పాలని డ్రగ్స్ ను నివారించాలని అంశాలతో విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించారు. తొలుత కళాశాలకు విచ్చేసిన జిల్లా అదనపు ఎస్పీ నక్క సూర్యచంద్రరావుకు కళాశాల ఎండి సాయి రోహిత్ పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు.