ఇబ్రహీంపట్నం: మహేశ్వరం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంతవుతుంది : కాంగ్రెస్ ఇంచార్జ్ కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి
మహేశ్వరం నియోజకవర్గం మేహబత్ నగర్ సిరిగిరి పురం గ్రామాల నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్లో చేరారు. తుక్కుగూడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ ఇంచార్జ్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి వారికి ఆదివారం మధ్యాహ్నం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా వచ్చిన ఇతర పార్టీ నాయకులకు సముచిత స్థానం ఇస్తామని కొత్త పాత నాయకులు కలిసికట్టుగా పనిచేసే సర్పంచ్ ఎన్నికలలో పార్టీ సూచించిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. వచ్చే స్థానిక ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంతవుతుందని తెలిపారు.