నారాయణపేట్: ప్రజలు గూడ్స్ వాహనాలలో ప్రయాణించరాదు పేట రూరల్ ఎస్సై రాముడు
నారాయణపేట ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాల మేరకు నారాయణపేట రూరల్ ఎస్సై రాముడు ఆధ్వర్యంలో రూరల్ పోలీసులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రూరల్ ఎస్సై రాముడు హెచ్చరించారు. ప్రజల రక్షణ రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు గూడ్స్ వాహనాలలో ప్రజలను తరలిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని రూరల్ ఎస్ఐ తెలిపారు. రూరల్ ఏరియాలో కూలీలను గూడ్స్ వానలో తరలిస్తున్న 8 వాహనాలను ఆటోలను బొలెరో వాహనాలను పట్టుకుని జరిమాన విధించినట్లు తెలిపారు. కేసులు రిపీట్ అయితే వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని రూరల్ ఎస్సై రాముడు తెలిపారు.