గుంతకల్లు: గుత్తికి చెందిన వైసీపీ నాయకుడు గంటా నరహరి ని రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించడంతో వైసీపీ శ్రేణులు సంబరాలు
గుత్తికి చెందిన వైసీపీ నాయకుడు గంటా నరహరి కి రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని బుధవారం గుత్తిలోని వైయస్సార్ విగ్రహం, గాంధీ సర్కిల్ లో వైసీపీ శ్రేణులు, గంటా నరహరి స్నేహితులు సంబరాలు నిర్వహించారు. వైయస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. కేక్ కట్ చేశారు. బాణాసంచా కాల్చారు. జై జగన్, జై జై జగన్, గంటా నరహరి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు.