మెదక్: మండల వ్యాప్తంగా ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు
Medak, Medak | Sep 17, 2025 నిజాంపేట మండల కేంద్రంలో ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్సై రాజేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా వ్యవసాయ కార్యాలయం వద్ద వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి, ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీడీఓ రాజిరెడ్డి, తహశీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ శ్రీనివాస్, గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద డిప్యూటీ తహసిల్దార్ రమ్యశ్రీ జాతీయ జెండాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో త్యాగమూర్తుల ఫలితమే తెలంగాణ అని మండల ప్రజలందరికీ తెలంగాణ విమోచన ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.