హిమాయత్ నగర్: మాగంటి గోపీనాథ్ చివరి చూపు చూసుకునే అవకాశం మా వాళ్లకు ఇవ్వలేదు : మాగంటి గోపీనాథ్ తల్లి మహానందకుమారి
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తల్లి మహానందకుమారి బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఆదివారం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూడుసార్లు ఎమ్మెల్యేగా చేసినా మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు అంత అర్జెంటుగా చేయాల్సిన అవసరం ఏంటని ఆమె ప్రశ్నించారు. గోపీనాథ్ చివరి చూపు చూసుకునే అవకాశం మా వాళ్లకు ఇవ్వలేదని డయాలసిస్ పేషెంట్ అయిన గోపీనాథ్ దగ్గర ఒక అటెండర్ను కూడా పెట్టకుండా ఎందుకు వదిలేశారని మాకండి గోపీనాథ్ తల్లి మహానందకుమారి ప్రశ్నించారు.