నిజామాబాద్ రూరల్: నడిపల్లి శివారులో రోడ్డు ప్రమాదంలో గాయల పాలైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్న CP సాయి చైతన్య
రోడ్డు ప్రమాదంలో గాయాల పాలన క్షతగాత్రుడికి ఆసుపత్రికి తరలించి సహాయాన్ని అందజేశారు సిపి సాయి చైతన్య. డిచ్పల్లి మండలం నడిపల్లి గ్రామ శివారులో బుధవారం సాయంత్రం అశోక్ గాబ్రీ అనే వ్యక్తి బైక్ పై వెళ్తుండగా అదుపుతప్పి రోడ్డు పక్కన పడిపోయాడు. దీంతో అటువైపుగా వెళ్తున్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య క్షతగాత్రుని గమనించి పరామర్శించారు. అనంతరం 108 కి సమాచారం అందించి వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.