చీమకుర్తి సర్కిల్ పరిధిలో సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిఐ దాసరి ప్రసాద్ సూచించారు. చీమకుర్తి పోలీస్ స్టేషన్ లో శనివారం సీఐ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజలు తమ ఫోన్లకు అపరిచిత వ్యక్తులు పంపే లింకులను ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయవద్దని హెచ్చరించారు .ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీ నెంబర్లు చెప్పమంటే చెప్పకూడదన్నారు. అపరిచిత వ్యక్తులకు సెల్ ఫోన్లు ఇవ్వవద్దని, ఎవరైనా సిబిఐ లేదా పోలీసులమని బెదిరిస్తే వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సిఐ సూచించారు.