కరీంనగర్: కేబుల్ బ్రిడ్జి నుండి హౌసింగ్ బోర్డు సమీపంలో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలు నిరుపయోగం, రోడ్డు పై కాకుండా అవతల ఏర్పాటు
ఇక్కడ మీరు చూస్తున్న సీసీ కెమెరాలు ఎక్కడో అడవిలో ఉన్నాయి అనుకుంటే మీరు పొరపడినట్లే. ఇక్కడ మీరు చూస్తున్న సిసి కెమెరాలు రోడ్డు పై ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించే వాహనాలను క్యాప్చర్ చేసేందుకు కరీంనగర్ పట్టణంలోని కేబుల్ బ్రిడ్జి నుంచి హౌసింగ్ బోర్డు చౌరస్తా వద్ద ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కాగా రోడ్డు పై ఏర్పాటు చేయాల్సిన ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నయిజేషన్, సర్వేలెన్స్ కెమెరాలను రోడ్డుకు పూర్తిగా అవతల 20ఫీట్ల దూరంలో ఏర్పాటు చేశారు. అది కూడా ఆ కెమెరా యాంగిల్ రోడ్డు వైపు కాకుండా అపోజిట్ డైరెక్షన్ లో ఏర్పాటు చేయడం పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.