పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో బైక్ చోరీ, పోలీసులకు ఫిర్యాదు అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో వీరేష్ అనే వ్యక్తికి చెందిన షైన్ ద్విచక్రవాహనం చోరికి గురైంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణానికి చెందిన వీరేష్ పని నిమిత్తం రైల్వే స్టేషన్ వద్దకు వెళ్ళాడు. ఏపీ02-ఏడబ్ల్యూ5506 నంబర్ బైక్ నిలిపి స్టేషన్ లోకి వెళ్ళాడు. ఇంటికి వెళ్లేందుకు గంట తరువాత వచ్చి చూడగా ద్విచక్రవాహనం కనిపించలేదు. దీంతో వీరేష్ తన బైక్ కోసం చుట్టుపక్కల గాలించాడు. అదే విధంగా పట్టణంలోని తన స్నేహితులు, తెలిసిన వారు, బంధువులు సన్నిహితుల ఇళ్ళ వద్ద బైక్ కోసం గాలించాడు