జుక్కల్: నర్సింగ్రావుపల్లి అటవీ లో లేగ దూడెను చంపిన పులి, పులి భయంతో బెంబేలు ఎత్తుతున్న ప్రజలు
నిజాంసాగర్ మండలం అటవీ ప్రాంతంలో పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. బుధవారం సాయంత్రం ఐదు గంటలకు ఈ విషయం తెలిసింది. స్థానికులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి నర్సింగ్రావుపల్లి శివారులో అటవీ ప్రాంతంలోకి వెళ్లిన సుబ్బూరి సాయిలు అనే రైతు లేగ దూడెను పులి చంపేసింది. గతంలో కూడా ఈ ప్రాంతంలో కొన్ని గొర్రెలను పులి చంపినట్లు గ్రామస్థులు తెలిపారు. దాదాపు 4 నుంచి 5 పులులు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నాయని చెబుతున్నారు. పులి సంచారంతో కంటి మీద కునుకు లేకుండా పోయిందని, చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, ప్రజలు కోరుతున్నారు.