పాణ్యం: ఓర్వకల్లు మండలం కనమడకల గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త వెంకటేశ్వర్లు, బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి
ఓర్వకల్లు మండలం కనమడకల గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త వెంకటేశ్వర్లు బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందారు. బుధవారం విషయం తెలుసుకున్న పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి దంపతులు ఆయన పార్థివదేహానికి పూలమాలల వేసి సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం కుటుంబాన్ని పరామర్శించి, కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ వారి కుటుంబానికి తోడుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.