అసిఫాబాద్: కొనుగోలు కేంద్రాలలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలి: జిల్లా అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సదుపాయాలు కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్ అన్నారు. శనివారం ఆసిఫాబాద్ జిల్లాలోని దహేగాం మండలం కల్పాడా, కొంచవెల్లి, చంద్రపెల్లి, గెర్నె, ఒడ్డుగూడ, లాగ్గాం గ్రామాలలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. జిల్లాలో వానాకాలం వరి ధాన్యం కొనుగోలు కొరకు 40 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సదుపాయాలు కల్పించాలని, కొనుగోలు కేంద్రాలను ఎత్తు ప్రదేశాలలో ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.