సంగారెడ్డి: చిక్ మద్దూర్ దుబ్బచెరువులో పడి వ్యక్తి మృతి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీధర్ రెడ్డి వెల్లడి
ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చిక్మదుర్ గ్రామ శివారులోని దుబ్బచెరువులో మంగళవారం చోటుచేసుకుంది. హత్నూర ఎస్సై శ్రీధర్ రెడ్డి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కుమ్మరి కృష్ణ గ్రామ శివారులోని దుబ్బచెరువులో పడి మృతి చెందినట్లు తెలిపారు. చెరువులో పడ్డ విషయాన్ని స్థానికులు కుటుంబీకులకు తెలపడంతో హుటాహుటిన చేరుకొని కృష్ణను బయటకు తీయగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కృష్ణ మృతి పట్ల అనుమానాలు ఉన్నాయని కుటుంబీకులు తెలపడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీధర్ రెడ్డి తెలిపారు.