ఖైరతాబాద్: సమస్యలు పరిష్కరించాలంటూ జిహెచ్ఎంసి కార్యాలయంలో డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి కి వినతి
శ్యామ్ ప్రసాద్ నగర్ బస్తీవాసుల వినతిపత్రం: డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం డిప్యూటీ మేయర్‌కు విజ్ఞప్తి... బాగ్‌లింగంపల్లి శ్యామ్ ప్రసాద్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు సోమవారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ప్రధాన కార్యాలయంలో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. శ్యామ్ ప్రసాద్ నగర్లో సుమారు 30 ఏళ్లుగా ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకుని వందలాది కుటుంబాలు నివసిస్తున్నాయని వారు వివరించారు. గత దశాబ్దాలుగా పలువురు ప్రజాప్రతినిధులు పక్కా ఇళ్లు అందజేస్తామని హామీలు ఇచ్చినా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు ల