అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని రాఘవేంద్ర ఫార్మసీ కళాశాల వద్ద గురువారం మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో ఇటుకలపల్లి ఎస్సై కరిష్మా ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటికలపల్లి ఎస్సై కరిష్మా మాట్లాడుతూ అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ఐపిఎస్ ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ లో భాగంగా వాహన తనిఖీ నిర్వహించడం జరిగిందని సరైన వాహన పత్రాలు లేనివారికి హెల్మెట్ ధరించని వారికి ఫైన్ కూడా వేయడం జరిగిందన్నారు, అదే విధంగా ఇతర వాహనాలు కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగిందని ఇటుకలపల్లి ఎస్సై కరిష్మా పేర్కొన్నారు. ఈ వాహన తనిఖీలు ఇటికలపల్లి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.